కై లాస్‌నగర్: జిల్లాలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 1,51,142 ఇళ్లకు స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో 1,50,384 ఇళ్లకు గానూ 1,25,733 ఇళ్లకు, ఆదిలాబాద్ మున్సిపల్ పరిఽధిలో 48,393 ఇళ్లకు గానూ 25,409 ఇళ్లకు స్టిక్కర్ అతికించినట్లు వారు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,98,777 ఇళ్లు ఉండగా గురువారం వరకు ఎన్యూమరేటర్లు లక్షా 51వేల ఇళ్లను సందర్శించి స్టిక్కర్లను అతికించారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే మున్సిపాలిటీలో హౌస్ స్టిక్కరింగ్ సర్వే కాస్త నెమ్మదిగా సాగుతోంది. పూర్తిస్థాయి హౌస్ లిస్టింగ్‌కు సమయం పట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment