తేమ పరిశీలనలో నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

తేమ పరిశీలనలో నిర్లక్ష్యం చేయొద్దు

Published Fri, Nov 8 2024 1:48 AM | Last Updated on Fri, Nov 8 2024 1:49 AM

తేమ పరిశీలనలో నిర్లక్ష్యం చేయొద్దు

తేమ పరిశీలనలో నిర్లక్ష్యం చేయొద్దు

ఆదిలాబాద్‌టౌన్‌: పత్తి తేమ పరిశీలనలో నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. గురువారం ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుతో పాటు పలు జిన్నింగ్‌ మిల్లులను తనిఖీ చేశారు. తేమ నిర్ధారణలో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందని, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కావద్దని హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు ఆరబెట్టిన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మార్కెట్‌ యార్డులో సీసీఐ అధికారులతో పాటు మార్కెటింగ్‌ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్‌ వెంట మార్కెటింగ్‌ ఏడీ గజానంద్‌, కార్యదర్శి మధుకర్‌, తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement