No Headline
జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో ఉన్న ఓ వైన్స్ వద్ద ఉదయం 7 గంటలకే తీసిన ఫొటో ఇది.. మందుబాబులు అక్కడే నిలబడి ఉన్నచోటే గ్లాసులో ఉన్న మద్యం తాగేస్తున్నారు. పక్కన సోడా బండి నిర్వాహకుడు వారు అడిగిన మందు ఇవ్వడమే కాకుండా వారికి సోడా పంపిణీ చేస్తున్నారు. అంతే కాకుండా తినడానికి స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. వైన్స్‌కు సంబంధించి అసలు షట్టర్ క్లోజ్ చేసి ఉండగా పక్కన ఉన్న స్థలంలో ఓ టేబుల్‌పై లిక్కర్ బాటిళ్లు, గ్లాసులు ఇలా రెడీగా ఉంచడం జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచే జిల్లా కేంద్రంలోని అన్ని వైన్స్‌ల వద్ద ఇదే పరిస్థితి ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment