కలెక్టరేట్ ఎదుట ఏఎన్‌ఎమ్‌ల ఆందోళన
కై లాస్‌నగర్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమశాఖలోని ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఏఎన్‌ఎమ్‌లు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ 9 నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపుల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వారాంతపు, పండుగ సె లవులు సైతం ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమల, కామేశ్వరి, జంగుబాయి, శ్యాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment