రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఇచ్చోడ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ అన్నా రు. గురువారం సాయంత్రం ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ పీవో శ్రీధర్, వైద్యాధికారులు కిరణ్‌కుమార్, అలేఖ్య, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వోకు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నరేందర్ రాథోడ్‌ను 3194 జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దూలం సత్యనారాయణ, సంతోష్ కుమార్, నల్ల రవీందర్, శ్రీనివాస్, శ్రీధర్, సురేశ్, బొమ్మెత సుభాష్, సచిన్, గంగాధర్, సమి, నగేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment