ఆదిలాబాద్‌టౌన్: చెకుముకి పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడం కోసం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 21న మండల స్థాయిలో, 28న జిల్లాస్థాయిలో, డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ కోసం ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ దేవేందర్ పటాస్కర్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ఉమాకాంత్, పెంటపర్తి ఊశన్న, జిల్లా నాయకులు దాసరి బాబన్న, మెస్రం రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment