● తెల్లవారిందే మొదలు.. వైన్స్‌ల వద్ద మందుబాబుల సందడి ●
సాక్షి, ఆదిలాబాద్: వైన్స్ షాపులు ఉదయం 10 గంటలకు తెరుచుకుని రాత్రి 10 గంటలకు మూసివేయాలి. అయితే ఈ నిబంధనలను మద్యం వ్యాపారులు అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉద యం 6 గంటల నుంచే దొడ్డిదారిన సోడా బండ్ల నిర్వాహకులతో మద్యం విక్రయాలను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించేవారే లేరు. పర్యవేక్షించాల్సిన ఎకై ్సజ్ అధికారులే దీన్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఓ ఆఫీసర్ ప్రోద్బలంతోనే మద్యం వ్యాపారులు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్టుగా వ్యవహా రం సాగుతుందన్న ఆరోపణలు లేకపోలేదు. ఏ స మయంలోనైనా లిక్కర్ అమ్ముకోండి.. నాకు మాత్రం నెలనెలా మామూళ్లు టంచనుగా తెచ్చి ఇవ్వాలనే ఒప్పందంతో ఈ వ్యవహారం సాఫీగా సాగుతుందనే అభిప్రాయం ఉంది. రాత్రి కూడా ఇ లాంటి వ్యవహారమే సాగుతోంది. నిబంధనల ప్ర కారం రాత్రి 10 గంటలకు అసలు షట్టర్ క్లోజ్ అవుతుంది. కానీ దొడ్డిదారిన అమ్మకాలు షురూ అవుతాయి. ఇలా అర్ధరాత్రి వరకు తతంగం కొనసాగుతుంది. ఎకై ్సజ్ అధికారులే దీన్ని ప్రోత్సహించడంతో మద్యం వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే అపవాదు వ్యక్తమవుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తాగుబోతుల కారణంగా రోడ్లపై సాధారణ జనం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సోడా బండి అద్దె రూ.50వేల పైమాటే..
జిల్లా కేంద్రంలో వైన్స్ మడిగెల అద్దె లక్ష రూపాయల వరకు ఉండగా, మద్యం వ్యాపారులు ప్రత్యామ్నాయ పద్ధతిలో ఇక్కడ వ్యాపారం ద్వారా లాభాలు గడిస్తున్నారు. ఎదుట సోడా బండి ఏర్పాటు చేసుకోవాలంటే నెలనెలా రూ.50వేల నుంచి అంతకంటే ఎక్కువ కూడా అద్దె చెల్లించాల్సి న పరిస్థితి ఉంది. ఇలా సోడా నిర్వాహకులు అంతా అద్దె చెల్లించడం వెనుక కూడా ఆంతర్యం లేకపోలేదు. అసలు టైమ్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ ఎదురుగా సోడా అమ్మకాలు సాగించే నిర్వాహకులకు మిగితా సమయంలో అసలు పని మొదలవుతుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల తర్వాత అర్ధరాత్రి వరకు వైన్స్‌ల వద్ద లిక్కర్ అమ్మకాలు సోడా బండ్ల ద్వారానే జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. ఏ బ్రాండ్ అయినా వారి వద్ద అందుబాటులో ఉంటుంది. దీంతో మందుబాబులు వైన్స్ అసలు షట్టర్ క్లోజ్ ఉన్నప్పటికీ లిక్కర్ ఎక్కడ లభిస్తుందనేది వారికి నిత్యకృత్యంగా తెలిసిన విషయమే. దీంతో అనధికారిక సమయాల్లో వ్యాపారులకు లిక్కర్ విక్రయాలు జరుగుతుండగా, సోడా నిర్వాహకులకు ఆ సమయంలో అమ్మకం ద్వారా రావాల్సిన కమీషన్‌తో పాటు సోడా డబ్బుల ఆదాయం కూడా దండిగా ఉంది. దీంతో ఈ అనధికారిక సమయాల్లో అన్ని బ్రాండ్‌ల మద్యం బాటిళ్లను వ్యాపారులు నిత్యం సోడా బండ్ల నిర్వాహకులకు ఇవ్వడం, వైన్స్ తెరిచిన తర్వాత ఆ సమయంలో జరిగిన లావాదేవీలన్ని లెక్కలు చూసుకోవడం పూర్తిగా పరిపాటిగా మారిపోయింది.
అలా జరిగే ప్రసక్తే లేదు..
వైన్స్‌లు ఉదయం 10 గంటలకు తెరుచుకుని రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయడం జరుగుతోంది. అనధికారిక వేళల్లో మద్యం విక్రయాలు జరిగే ప్రసక్తే లేదు. ఎక్కడా అసలు టైమ్‌కంటే ముందు, ఆ తర్వాత విక్రయాలు జరుగుతున్నట్లయితే మేము తనిఖీ చేయడం
జరుగుతుంది. దీన్ని అరికడతాం.
– హిమశ్రీ, డీపీఈవో, ఎకై ్సజ్ శాఖ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment