సర్వేలో పారదర్శకత లోపిస్తే చర్యలు
● కలెక్టర్ రాజర్షిషా
ఉట్నూర్‌రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని వార్డ్ నెం.10లో చేపట్టిన సర్వేను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి పరిశీలించారు. ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో మహేశ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వేస్తున్న స్టిక్కరింగ్ పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞాన్, సిబ్బంది అంజిత్, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ఉద్యాన నర్సరీ ప్రారంభం
ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీల్లో పెంచుత్ను వివిధ రకాల పూలు, పండ్లు, అలంకరణ మొక్కలను రైతులు, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గిరిజన ఉద్యాన కేంద్రాన్ని ప్రారంభించామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం మండల కేంద్రంలో గిరిజన ఉద్యాన నర్సరీని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యాన అధికారి సందీప్‌కుమార్, ఉద్యాన శాఖ సిబ్బంది అర్షిత, సాయి రాజ్, రాజేంద్ర ప్రసాద్, పూజ, చందర్, తదితరులు పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి●
ఆదిలాబాద్‌టౌన్: పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల బాలక్ మందిర్‌లో స్కూల్ కాంప్లెక్స్ ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని, ఇప్పటినుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌కు తొలి మెట్టని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతీరోజు పాఠశాలలకు పంపించాలన్నారు. ఎస్‌ఏ–1 ఫలితాల ఆధారంగా విద్యార్థులను గ్రూప్‌లుగా విభజించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత, డీసీఈబీ సెక్రెటరీ గజేందర్, సెక్టోరియల్ అధికారి నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment