ఫూల్ కాలి బైగా మృతిపై విచారణ జరపండి
● అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
బోథ్: ఫుడ్ పాయిజన్ జరిగి సరైన వైద్యం అందక ఫూల్ కాలి బైగా అనే యువతి ఈ నెల 5న మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ‘వైద్యం అందితే బతికేదేమో..?’ అనే ఽశీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పందించారు. మృతిపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం బాసర జోన్ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా) అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ టి.నాయక్, ఆదిలాబాద్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మెట్పెల్లివార్ శ్రీధర్ విచారణ చేపట్టారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన మిగతా సిబ్బందికి చికిత్స చేసిన వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సెయింట్ థామస్ పాఠశాలలో విచారణ చేపట్టారు. నివేదికను కమిషనర్ ఆర్వీ కర్ణణ్‌కు అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment