పులి పయనమెటు?
సాక్షి, ఆదిలాబాద్: మహబూబ్ ఘాట్స్‌లో ఆది వారం రాత్రి కనిపించిన పులి ఎటువైపు వెళ్లింద నే విషయంలో అటవీ అధికారులు చెబుతున్న దానికి.. క్షేత్రస్థాయిలో కనిపించిన దానికి పొంతన కుదరడం లేదు. ఆదిలాబాద్‌కు వచ్చే మా ర్గంలో నిర్మల్ మొదట్లోనే ఘాట్స్ సెక్షన్ ఉంటుంది. ఆదివారం నిర్మల్ నుంచి బోథ్‌కు వచ్చేవారికి ఆ రాత్రి సమయంలో రోడ్డు దాటుతు న్న పులి తారస పడింది. కుడివైపు నుంచి ఎడ మ వైపు రోడ్డు దాటుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ లెక్కన పులినేరడిగొండ అడవుల్లోకి వెళ్లిందనేది స్పష్టమవుతుంది. అయితే సోమవారం మామడ అటవీ ప్రాంతం వైపు వెళ్తున్నట్లు కని పించిందని అటవీ అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి కవ్వాల్ అభయారణ్యం వైపు దా ని అడుగులు పడుతున్నాయని పేర్కొంటున్నా రు. అయితే రాత్రి ఘాట్స్‌లో నేరడిగొండ వైపు వెళ్లిన పులి మళ్లీ రివర్స్‌లో మామడ వైపునకు మళ్లినట్లుగా అటవీఅధికారులు భావిస్తున్నారు.
19 రోజుల క్రితం..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం చింతల్‌బోరి అటవీ ప్రాంతంలో అక్టోబర్ 22న పులి కనిపించింది. ఆ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వ ర్ అభయారణ్యానికి చెందిందని అప్పట్లో అట వీ అధికారులు పేర్కొన్నారు. కిన్వట్ మార్గంగా ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు బోథ్ దగ్గరి ఘన్‌పూర్ నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చిందని అప్పట్లో చెప్పారు. అనంతరం బోథ్ మండలంలోని గొల్లాపూర్, చింతగూడ, నేరడిపల్లి, కంటెగాంలో పులి సంచరించినట్లు స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించిన విష యం తెలిసిందే. అక్కడి నుంచి పులి మహా రాష్ట్రలోని అప్పారావుపేట అడవుల్లోకి వెళ్లిందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత మళ్లీ నిర్మల్ జిల్లాలోని కుంటాల, సారంగాపూర్ మండలా ల్లో కనిపించిందని జనం అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆదివారం రాత్రి మహబూబ్ ఘాట్స్‌లో మళ్లీ రోడ్డు దాటుతుండగా వీడియో తీయడంతో అది ఇక్కడే తిరుగుతుందనేది స్పష్టమైంది. అయితే 19 రోజుల క్రితం బోథ్‌లో కనిపించిన పులి ఇదేనా అనే విషయంలో అటవీఅధికారులు స్పష్టంగా చెప్ప లేక పోతున్నారు. ఒకవేళ ఇన్ని రోజులుగా ఇటువైపు అటవీ ప్రాంతంలోనే ఆ పులి తిరుగుతుందంటే అంతటి ఆవాసం ఈ అటవీ ప్రాంతంలో కూడా ఉందా అనే ప్రశ్న ప్రస్తుతం సా మాన్యుల్లో వ్యక్తమవుతుంది. ఒకప్పుడు దట్టంగా ఉండే ఈ అటవీ ప్రాంతం తర్వాత రోజుల్లో పల్చబడిందని, అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందనే ప్రచారం సాగింది. అయితే తాజాగా పులి సంచారం, వజ్జర్‌లో కొద్ది రోజుల క్రితం చిరుత కనిపించడంతో పాటు దుప్పులు, ఎలుగుబంట్లు, మనుబోతులు అటవీ ప్రాంతాల్లో తారస పడుతున్నట్లు స్థానికులు పేర్కొనడం వన్యప్రాణుల ఆవాస అవకాశాలపై సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రధానంగా కంటేగాం, కైలాస్‌టే క్డి, వజ్జర్, చింతల్‌బోరి అటవీ ప్రాంతం వైపు ఈ సమయంలో పులి వచ్చి వెళ్తుందని పలువు రు చెబుతున్నారు. ఈ లెక్కన ఇటువైపు అటవీ విస్తీర్ణం పెరిగిందనే ప్రచారం కూడా వినిపిస్తుంది. అయితే అటవీ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రస్తావన చేయడం లేదు.
‘కవ్వాల్’ వైపు అంటున్న అటవీ అధికారులు
ఘాట్ రోడ్డు దాటింది మాత్రం దానికి రివర్స్‌లో..
ఇటీవల బోథ్ అడవుల్లో కనిపించింది ఇదేనా?
స్పష్టత ఇవ్వని ఫారెస్ట్ ఆఫీసర్స్
భయాందోళన..
పులి ఏకంగా రహదారిపై కనిపించడంతో జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే మార్గాల్లోనే అనేక మందికి సంబంధించిన పట్టా వ్యవసాయ భూములు ఉన్నాయి. వారు నిత్యం లోపలి వరకు వెళ్లి సాగు పనులు చేసుకుంటారు. ప్ర స్తుతం పత్తి దిగుబడులకు సంబంధించి పత్తి తీత పనులు సాగుతున్నాయి. పులి కదలికల నేపథ్యంలో అటవీ అధికారులు ఎక్కువ లోపలి వరకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు పులి సంరక్షణ కోసం అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. మొత్తంగా ఈ పులి అడుగులు ఎటువైపు పడతాయి.. పూర్తి గా అభయారణ్యానికి చేరుకుంటుందా, లేనిపక్షంలో మళ్లీ ఇటువైపే సంచరిస్తుందా.. వంటి సందేహాలు జనం మదిని తొలుస్తున్నాయి.
కవ్వాల్ వైపు వెళ్తుంది..
మహబూబ్ ఘాట్స్‌పై ఆదివారం రాత్రి కనిపించిన పులి కవ్వాల్ అభయారణ్యం వైపు వెళ్తుంది. నవంబర్, డిసెంబర్ సమయాల్లో ఏటా పులి కదలికలు ఇటువైపు కనిపిస్తాయి. ప్రస్తుతం అది ఎటువైపు వెళ్తుందనే విషయంలో ట్రేస్ చేస్తున్నాం. –ప్రశాంత్ బాజీరావు పాటిల్,
డీఎఫ్‌వో, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment