ఓటరు నమోదుపై ఆసక్తి●
● రెండు రోజుల్లో 1,364 దరఖాస్తులు
కై లాస్‌నగర్: ఓటర్ల జాబితా సవరణ–2024 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9,10 తేదీల్లో చేపట్టిన ప్ర త్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి జిల్లాలో స్పందన లభించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో 18ఏళ్లు నిండిన యువత 1,364 మంది ఫారం–6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని బీఎల్వోలకు అందజేశారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 598 దరఖాస్తులు రాగా, బోథ్ నియోజకవర్గంలో 766 వచ్చాయి. అలాగే ఫారం–7కు సంబంధించి 96 దరఖాస్తులు అందాయి. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 33, బో థ్లో 63 ఉన్నాయి. అలాగే ఫారం–8 దరఖాస్తులు 359అందాయి. వీటిలో ఆదిలాబా ద్లో 135, బోథ్‌లో 224 ఉన్నాయి. వీటిపై ఈనెల 28 వరకు అధికారులు అభ్యంతరా లు స్వీకరించనున్నారు. వీటన్నింటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం వచ్చే ఏడాది జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment