● రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ● జిల్లాకు మాత్రం మరోసారి రిక్తహస్తం ● అనుకూలతలున్నా కేంద్రం చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

● రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ● జిల్లాకు మాత్రం మరోసారి రిక్తహస్తం ● అనుకూలతలున్నా కేంద్రం చిన్నచూపు

Published Tue, Nov 19 2024 12:53 AM | Last Updated on Tue, Nov 19 2024 12:53 AM

● రాష

● రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ● జి

జిల్లా కేంద్రంలోని విమానాశ్రయ మైదానం

కై లాస్‌నగర్‌: అన్నీ ఉన్నా అల్లుని నోట్ల శని అన్న చందంగా తయారైంది ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణ పరిస్థితి. జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కు అవసరమైన విశాలమైన స్థలంతో పాటు జా తీయ రహదారి, రైల్వేలైన్‌, పత్తి పరిశ్రమలు వంటి వనరులు అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. కొత్తగా రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో వరంగల్‌ జిల్లాలోని మా మునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం నిధులు సైతం కేంద్రం విడుదల చేసింది. జిల్లావాసుల చిరకాల కోరిక అయిన ఆదిలాబాద్‌కు మాత్రం మరో సారి రిక్తహస్తమే చూపింది. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రధాని మోదీకి మాజీ ఎంపీ సోయం బాపూరావుతో పాటు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ వేదికపై స్వ యంగా నివేదించారు. అలాగే ఎంపీ నగేశ్‌ స్వయంగా ఇటీవల కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి ని కలిసి విన్నవించినా ఫలితం దక్కలేదు. కేంద్రం నిర్ణయంతో జిల్లావాసుల్లో నిరాశ వ్యక్తమవుతుంది.

స్థల సేకరణ చేపట్టినా..

నిజాం కాలంలో విమాన రాకపోకలకు అనువుగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రక్షణశాఖకు సంబంధించి 369 ఎకరాల విశాలమైన స్థలం కలిగి ఉంది. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లే క్రమంలో రక్షణశాఖకు చెందిన విమానాలు ఇంధనం కోసం ఈ మైదానంలో దిగుతుంటాయి. ఇక్కడ వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ కోసం 2014లో కేంద్ర రక్షణశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబు హయాంలో అధికారులు సర్వే నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపించారు. 2వేల ఎకరాల భూమి అవసరమని కేంద్రం సూచించింది. దీంతో అందుబాటులో ఉన్న రక్షణశాఖ స్థలం 369 ఎకరాలతో పాటు పట్టణ శివారులోని కచ్‌కంటి, అనుకుంట, తంతోలి, ఖానాపూర్‌ శివారులోని 1591.05 ఎకరాల ప్రైవేట్‌ భూమిని గుర్తించి కేంద్రానికి నివేదిక పంపారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం దీనిపై ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రక్రియలో ముందడగు పడలేదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కదలిక

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎయిర్‌పోర్టు నిర్మాణ అంశంలో కొంత కదలిక వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తూ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నివేదించారు. ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీని ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన ప్రభుత్వం భూసేకరణ తాజా వివరాలను పంపించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో గతంలో గుర్తించిన 1591.05 ఎకరాల భూమికి ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.438.67 కోట్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ ప్రతిపాదనలను కలెక్టర్‌ సీఎం పేషికి పంపించారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉండగా ఇటీవల సర్వే ల్యాండ్‌ రికార్డుకు సంబంధించిన అధికారులు గతంలో గుర్తించిన ప్రభుత్వ భూముల హద్దులను జీపీఎస్‌ ద్వారా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే ఎయిర్‌స్ట్రిప్‌, లేదా ఎయిర్‌పోర్టు నిర్మాణం అవుతుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూశారు.

సీఎం, కేంద్ర మంత్రికి విన్నవించినా..

ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పదేపదే నివేదించగా ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ ఈ ఏడాది ఆగ స్టు 2న కేంద్ర పౌరవిమానయాన మంత్రి రా మ్మోహన్‌ నాయుడును స్వయంగా ఢిల్లీలో కలిసి జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణశాఖ స్థలం సిద్ధంగా ఉండటంతో పాటు సేకరించిన భూ వివరాలను కేంద్రమంత్రికి వివరించారు. ఇలా దానికోసం పట్టుదలగా ప్రయత్నిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారే కావడం, కేంద్రంలోనూ ఎన్డీయే సర్కారు ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ సారి తప్పనిసరిగా జిల్లాకు ఎయిర్‌పోర్టు లేదంటే ఎయిర్‌స్ట్రిప్‌ ఎదో ఒకటి మంజూరవుతుందని జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం ఆదివారం ప్రకటించిన నిర్ణయంతో జిల్లాకు మరోసారి మొండిచేయి ఎదురైంది.

కేంద్రం పరిశీలనలో ఉంది

జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు లేదా వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిని ఇటీవల కలిసి విన్నవించాను. కొత్తగా ప్రకటించిన మూడు ఎయిర్‌పోర్టుల్లో జిల్లాకు చోటు దక్కలేదు. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. దాన్ని ప్రకటించేలా మరోసారి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళుతాను.

– గోడం నగేశ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ

No comments yet. Be the first to comment!
Add a comment
● రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ● జి1
1/2

● రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ● జి

● రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ● జి2
2/2

● రాష్ట్రంలో మూడు ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ● జి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement