● జిల్లాకు 85 చెక్‌డ్యాంలు ● జలసిరి పెంపే లక్ష్యం ● రూ.
కై లాస్‌నగర్: ప్రతీ వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి.. వృథాగా ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసేదిశగా రా ష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పారుతు న్న నీటిని నిలిపి సంరక్షించే దిశగా చెక్ డ్యాంల ని ర్మాణాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగానే 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు పెద్ద ఎత్తున చెక్ డ్యాంలను మంజూరు చేసింది. ఇప్పటికే పాలన అనుమతులు జారీ అయ్యాయి. ని ర్మాణాలకు అవసరమైన స్థలాలను సైతం గుర్తించి న అధికారులు గడువులోపు పూర్తి చేసే దిశగా కసర త్తు చేస్తున్నారు. తద్వారా భూగర్భజలాల పెంపుతో పాటు నీటి ఎద్దడికి చెక్‌పడే అవకాశముంటుంది. రైతుల సాగునీటి కష్టాలు సైతం తొలగనున్నాయి.
ఏజెన్సీ మండలాలకు ప్రాధాన్యత
ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఏటా వేసవిలో నీటి ఎద్దడి సమస్య నెలకొంటుంది. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. సమస్యను నివారించడంలో భాగంగా ఆయా ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన జనాభా ఎక్కువగా ఉండే నార్నూర్ మండలానికి అత్యధికంగా 15 చెక్‌డ్యాంలను కేటాయించగా, ఉట్నూర్‌కు10, సిరికొండకు 8 చొప్పున మంజూరు చేశారు. మిగతా మండలాల్లోనూ ఎక్కడైతే సమస్య అధికంగా ఉందో ఆయా గ్రామాల్లోనూ నిర్మించేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఆ దిశగా నిర్మాణాలకు సైతం ప్రాధాన్యతనిస్తున్నారు.
లక్ష్యానికి మించి మంజూరు
2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 51 చెక్‌డ్యాంలను నిర్మించాలని లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే జిల్లాకు లక్ష్యానికి మించి 85 చెక్‌డ్యాంలను ఉన్నతాధికారులు మంజూరు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఒక్కో దానిని రూ.5లక్షల చొప్పున రూ.4.25 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. ఇప్పటికే ఐదు చోట్ల నిర్మాణాలు పూర్తి కాగా మిగతా చోట్ల త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.
తాంసి మండలంలోని హస్నాపూర్ గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం (ఫైల్)
మండలం మంజూరైన పూర్తయినవి
చెక్‌డ్యాంలు
ఆదిలాబాద్‌రూరల్ 02 00
బజార్‌హత్నూర్ 07 00
బేల 05 00
భీంపూర్ 04 00
బోథ్ 07 00
ఇచ్చోడ 03 00
గాదిగూడ 06 01
గుడిహత్నూర్ 00 00
ఇంద్రవెల్లి 04 00
జైనథ్ 00 00
మావల 01 00
నార్నూర్ 15 01
నేరడిగొండ 07 00
సిరికొండ 08 00
తలమడుగు 03 02
తాంసి 03 01
ఉట్నూర్ 10 00
వందశాతం పూర్తిచేసేలా చర్యలు
జిల్లాకు మంజూరైన చెక్‌డ్యాంల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలు చోట్ల పూర్తయ్యాయి. మిగతా చోట్ల స్థలాలను గుర్తించాం. వాటిని కూడా త్వరలోనే ప్రారంభించి వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తాం. అలాగే నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. – సాయన్న, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment