రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్:రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో నూ సత్తా చాటాలని జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి ని స్టేడియంలో బుధవారం సీఎం కప్–హాకీ పురుషుల జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపా రు. వీరి కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పా టు చేశామన్నారు. ఈనెల 27నుంచి 29 వర కు హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వీరు ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. 16 మంది క్రీడాకారుల ను ఎంపిక చేయగా, ట్రైనర్‌గా జే. రవీందర్, మేనేజర్‌గా డేవిడ్‌రాజు వ్యవహరిస్తారని వివరించారు. ఇందులో సీనియర్ ప్లేయర్స్ ఇజాజ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment