కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుపై ఆరా
● వాతావరణ కేంద్రాలను పరిశీలించిన ప్రత్యేక బృందం
కై లాస్‌నగర్: జిల్లావ్యాప్తంగా వారం క్రితం వరకు రాష్ట్రంలోనే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వాతావరణ, గణాంక బృంద సభ్యులు జిల్లాలో పలు నమోదు కేంద్రాలను తనిఖీచేశారు. రెండు రో జులుగా జిల్లాలోని రాంనగర్‌తో పాటు తలమడుగు మండలంలోని బరంపూర్, బోథ్ మండలంలోని పొచ్చెరలోగల ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాలను సందర్శించారు. అక్కడ నమోదైన ఉష్ణోగ్రతలతో పాటు మ్యానువల్‌గా సైక్లోమీటర్ ద్వారా ఉష్ణోగ్రతలను పరిశీలన చేశారు. రెండింటి నమోదులో అంతగా తేడా కనిపించలేదని ప్రత్యేక బృందం సభ్యుడు సమ్మయ్య తెలిపారు. ఉదయం సమయంలో 4 గంటల నుంచి ఆరు గంటల వరకు స్వయంగా ఆయా కేంద్రాల వద్ద నమోదుపై ఆరా తీసినట్లు వెల్లడించా రు. జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం యోచన చేస్తుందని తెలిపారు. వారి వెంట డివిజన ల్ డీవైఎస్‌వోలు శ్రీనివాస్, ఎంపీఎస్‌వోలు గంగా రెడ్డి, దయాకర్, మనోహర్, అభిలాష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment