‘ఏడాదైనా చాయ్ తాగే టైం దొరకలేదా..?’
కై లాస్‌నగర్: తాము అధికారంలోకి వస్తే చాయ్ తాగేలోపు సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డికి ఏడాది పాలన పూర్తయినా చాయ్ తాగే సమయం దొరకడం లేదా అని ఎ మ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. తమకు ఉ ద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ ఎ దుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరింది. బుధవారం బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సమ్మె శిబిరం నుంచే ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగులకు అండగా నిలిచేలా ధైర్యాన్నిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. వారికి పార్టీ తరఫున రూ.25వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు రమేశ్, నగేష్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
‘సీఎం ఇచ్చిన మాటను నిలుపుకోవాలి’
సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించి సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో వారికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం సమగ్ర ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘం తరఫున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సమ్మెతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడి పోయిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఇందులో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, ప్రచార కార్యదర్శి భరత్, భుజంగరావు, చిత్రు, సంతోష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment