పులి రాక కోసం..
● జిల్లాలో బెబ్బులి సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తం ● టైగర్‌జోన్ పరిధిలో ఆటంకాలు లేకుండా తనిఖీలు
జన్నారం: పులి రాకకోసం అటవీశాఖ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లి, వేమనపల్లి, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి జన్నారం అటవీ డివిజన్‌లోనే ఆవాసం ఏర్పర్చుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నా లుగేళ్లుగా రాకపోకలతోనే సరిపెడుతున్న పులి ఇ క్కడే ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్‌జోన్ జన్నారం అటవీ డివిజన్‌లోని అటవీ రేంజ్‌లో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. 2024 సెప్టెంబర్‌లో పైడిపెల్లికి చెందిన ఓ రైతు ఆవులపై దాడి చేసిన పులి అప్పటి నుంచి ఇందన్‌పల్లి, జన్నారం అటవీ రేంజ్‌లలో పర్యటించినట్లు కెమెరాకు చిక్కింది. అక్కడి నుంచి కాగజ్‌నగర్ వైపు వెళ్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటికై నా ఈ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అలజడి లేకుండా
20 డిజిబుల్ శబ్ధం వచ్చినా పులికి వినిపిస్తుందని, అందుకే అలజడి ఉన్నచోట పులి ఉండదని అధికా రులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జన్నారం అటవీ డివిజన్‌లోని పలు అటవీ బీట్‌లలో పశువులు, మనుషుల సంచారం లేకుండా చర్యలు చేపడుతున్నారు. పులి సంచరించే ట్రాక్‌లో ఎలాంటి శబ్ధం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. టైగర్ మానిటరింగ్ చేస్తూ ట్రాక్‌ను క్లియర్ చేస్తున్నారు.
ఇందన్‌పల్లి రేంజ్‌లో పరిశీలన
ఫారెస్ట్ మార్చ్‌లో భాగంగా అధికారులు రేంజ్ పరిధిలోని అటవీ బీట్‌లలో పర్యటిస్తూ ఉచ్చులు, కరెంటు తీగలు, వలలు, తదితర ప్రాణాంతక పరికరాలు తనిఖీ చేస్తున్నారు. అలాంటివి ఉంటే ముందుగా తొలగిస్తూ అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జన్నారం బీట్‌లో ఉచ్చులు అమర్చిన ఇద్దరు వ్యక్తులను బైండోవర్ చేశారు. ఎప్పటికప్పుడు టైగర్ ట్రాక్‌ను పరిశీలిస్తూ పులి ఆవాసం ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
15 కిలోమీటర్లు కాలినడకన..
ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లో ఫారెస్ట్ మార్చ్ నిర్వహించి సిబ్బందితో కలిసి 15 కిలోమీటర్లు కాలినడకన టైగర్‌ట్రాక్ పరిఽశీలించినట్లు రేంజ్ అధికారి తెలిపారు. కల్పకుంట నుంచి మొదలు కవ్వాల్ అటవీ సెక్షన్‌లోని రాగికుంట వరకు వాగులు, దారులు పరిశీలించి అవాంతరాలు లేకుండా చూసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment