ట్రిపుల్‌ఐటీలో ముగిసిన వర్క్‌షాప్
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో పవర్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ అనే అంశంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వెహికిల్ పరిశ్రమ కోసం భవిష్యత్ ఇంజనీర్లను రూపొందించడంలో ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఎలక్ట్రానిక్స్ వెహికిల్ చార్జర్లు, డ్రైవ్ రైళ్లు, పవర్ కన్వర్టర్, టెక్నాలజీలపై ఈ సదస్సులో వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ మురళీదర్శన్, ఏవో రణధీర్‌సాగీ, కోఆర్డినేటర్‌లు లక్ష్మణ్, ముత్యం, వినయ్‌కుమార్, హెచ్‌వోడీ బావుసింగ్, ఎన్.రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment