భైంసాలో ఆగని చోరీలు..!
భైంసాటౌన్: భైంసా పట్టణంలో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. ఆలయాలు, ఇళ్లు, దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. శనివారం రా త్రి దాటిన తర్వాత భైంసా–నిర్మల్ రహదారిలో గల ఎస్‌బీఐ బ్యాంక్ సమీపంలో ఓ ఆన్‌లైన్ డెలివరీ బ్రా ంచ్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకు న్న పోలీసులు ఆదివారం ఉదయం క్లూస్‌టీంతో ఆ ధారాలు సేకరించారు. స్థానిక పులేనగర్‌లో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యా యి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలో పోలీసు బందోబస్తు ఉన్నా చోరీలు ఆగకపోవడం పట్టణ వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment