యువకుడు బలవన్మరణం
కోటపల్లి: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల మేరకు చెన్నూర్ పట్టణంలోని మహంకాళి వాడకు చెందిన మాదాసు రాజన్న, రాజేశ్వరి దంపతుల కుమారుడు మాదాసు పవన్ కళ్యాణ్ (24) స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం కోటపల్లి మండలంలోని రాంపూర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. కొంతసేపటికి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన యువకుడు నోట్లో నుంచి నురగలు కక్కుతుండడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108కు స మాచారం అందించా రు. చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. అయితే సదరు యువకుడు ఆన్‌లైన్లో షేర్‌మార్కెట్‌లో డబ్బులు పెడుతుండేవాడని, పెద్దమొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడంతోనే కలతచెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి ఫిర్యాదు చేశాడు.
పురుగుల మందు తాగి ..
లింగాపూర్: పురుగుల మందుతాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై గంగన్న తెలిపిన వివరాల మే రకు వంజరిగూడకు చెందిన అవినాష్ (19) చదువు మధ్యలో మానేసి రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్నా డు. ఏదైనా పనిచేసుకోవాలని తండ్రి హన్మంతు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. గతనెల 31న ఇంట్లోనే గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జైనూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
శివాలయంలో చోరీ
జైపూర్: మండలంలోని పెగడపల్లిలో అతి పురాతనమైన శివాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఊరికి చివరగా ఉన్న శివాలయంలో గుర్తు తెలియని దుండగులు గుడి తాళం పగులగొట్టి శివలింగంపై ఉన్న రెండు వెండి పగడాలు, పార్వతి అమ్మవారి విగ్రహంపై ఉన్న జత బంగారు పుస్తెలు(అరతులం) అపహరించారు. వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపారు. ఆలయ అర్చకులు మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment