రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
ఇంద్రవెల్లి: ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, 108 ఫైలెట్ ఆత్రం అశోక్, ఈఎంటీ ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు ఉట్నూర్ మండలంలోని ఓడిని గ్రామానికి చెందిన సురాజ్, తేజష్, విక్రం శనివారం రాత్రి కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్లి వస్తుండగా ముత్నూర్, కేస్లాపూర్ గ్రామాల మధ్య గుడిహత్నూర్ మండలంలోని మర్కగూడకు చెందిన ఆటో ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. తేజష్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు రోడ్డుపై ఉన్న గుంతల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment