సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు | Sakshi
Sakshi News home page

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు

Published Fri, May 10 2024 7:10 PM

సంక్ష

అడ్డతీగల: రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. మండలంలోని ఎల్లవరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో గంగవరం మండలం పండ్రప్రోలులో టీడీపీకి చెందిన 20 జెడ్పీటీసీ బేబీరత్నం ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన మడకం ప్రసాద్‌,కుక్కల గంగన్నదొర ఆధ్వర్యంలో వారంతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మోహన్‌ పాల్గొన్నారు. అసెంబ్లీ అభ్యర్థి ధనలక్ష్మి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

అరకులోయ రూరల్‌: టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్‌కుమార్‌, ఎస్టీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జన్ని నర్సింహమూర్తి తెలిపారు. గురువారం మండలంలో చిన్నలబుడు పంచాయతీ మాలివలస గ్రామనికి చెందిన కిల్లో కృష్ణ,గుంట రామారావుతో టీడీప కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి వారు పార్టీ కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై చేరికలు

జి.మాడుగుల: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ, ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలో భారీగా చేరుతున్నారని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శెట్టి వినయ్‌ తెలిపారు. బొయితిలి పంచాయతీకి చెందిన టీడీపీ నేతలు మాజీ వైస్‌ సర్పంచ్‌ వెలుసూరి చిన్నయ్య, మాజీ వార్డు నంబర్లు లొంబొరి చిట్టిబాబు, పొత్తూరు దేవన్నదొర, పూజారి కొండబాబు పనసపూరి సింహాచలం ఆయన సమక్షంలో గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి, పాడేరు అసెంబ్లీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజులను గెలిపించాలని కోరారు. పోలింగ్‌ తేదీలోగా టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాలన్న, మాజీ ఎంపీటీసీ బ్రహ్మలింగం, మాజీ సర్పంచ్‌ మత్స్యరాస ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
1/2

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
2/2

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు

Advertisement
 
Advertisement
 
Advertisement