మన్యం కాఫీ ఖ్యాతి మరింత పెంపునకు కృషి | - | Sakshi
Sakshi News home page

మన్యం కాఫీ ఖ్యాతి మరింత పెంపునకు కృషి

Published Sun, Oct 20 2024 3:02 AM | Last Updated on Sun, Oct 20 2024 3:02 AM

మన్యం కాఫీ ఖ్యాతి మరింత పెంపునకు కృషి

చింతపల్లి: మన్యం కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందని దీన్ని గిరిజన సహకార సంస్థ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు గిరిజన రైతులంతా సహకరించాలని జీసీసీ ఎండీ కల్పనాకుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె ఐటీడీఏ పీవో అభిషేక్‌తో కలసి చింతపల్లిలో జీసీసీ, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈఏడాది కాఫీకి జీసీసీ ద్వారా మంచి గిట్టుబాటు ధరలను ప్రకటించామన్నారు. కిలో పార్చిమెంటు ధర రూ.285 , చెర్రీ ధర కిలో రూ.150 రొబస్టా కిలో రూ.80గా నిర్థారించినట్టు చెప్పారు. ఈఏడాది రెండు వేల మెట్రిక్‌ టన్నుల కాఫీని జీసీసీ ద్వారా గిరిజన రైతులనుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులు నాణ్యతపై కూడా దృష్టి పెట్టేలా వారికి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కాఫీ బోర్డు, ఐటీడీఏ ద్వారా రైతులకు అవసరమైన యంత్రాలు, పరికరాలను రాయితీపై సరఫరా చేస్తున్నట్టు పీవో అభిషేక్‌ వెల్లడించారు. అనంతరం ఎండీ, ఐటీడీఏ పీవోతో కలసి చింతపల్లిలోని మ్యాక్స్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. రైతుల కాఫీ తోటలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ ఏడీ అశోక్‌, జీసీసీ డీఎంలు దేవరాజ్‌, సింహాచలం, జీసీసీ బ్రాంచి మేనేజర్లు మురళీకృష్ణ, విజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, మ్యాక్స్‌ అధ్యక్షుడు సెగ్గె కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

2 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యం

జీసీసీ ఎండీ కల్పనాకుమారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement