సాక్షి,పాడేరు: పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన పలుశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పర్యావరణానికి, అడవులకు హాని కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలలో రహదారుల అభివృద్ధితో పాటు తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. పర్యాటక,అటవీ ప్రాంతాలలో అనుమతులు లేకుండా ఫైర్ క్యాంపులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఏజెన్సీ ముఖ ద్వారాల వద్ద పర్యాటకుల వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమంగా మద్యం విక్రయాలు, బెల్టుషాప్‌లు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బైక్‌లపై వచ్చే పర్యాటకులు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీశాఖ అనుమతులు లేకుండా అడవుల్లోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలలో వాణిజ్య సంస్థలు,హోటళ్లు, రిసార్ట్‌ల యాజమానులు తప్పనిసరిగా డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని, చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరన్నారు. ఎస్పీ అమిత్‌బర్దర్ వర్చువల్ విధానంలో,జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ్, ఐటీడీఏ పీవో అభిషేక్, పాడేరు సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్, పాడేరు డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఆర్వో పద్మావతి, జిల్లా పర్యాటక అధికారి దాసు, డీపీవో లవరాజు, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, డీఎల్పీవో పీఎస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణానికి హాని కలిగిస్తే చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment