ముగిసిన రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలు
పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని తలార్‌సింగి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్ జిల్లాల ఽథాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–14,17,19 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా క్రీడా పోటీలు నిర్వహించారు. అండర్–14 బాల,బాలికల విభాగాల్లో ఓవరల్ చాంపియన్‌గా ఉమ్మడి విశాఖపట్నం, రెండో స్థానంలో తూర్పుగోదావరి, మూడో స్థానంలో విజయనగరం, అండర్–17 బాలబాలికల విభాగాల్లో ఓవరాల్ చాంపియన్‌గా తూర్పుగోదావరి, రెండో స్థానంలో విజయనగరం, మూడో స్థానంలో విశాఖపట్నం, అండర్ –19 బాల, బాలికల విభాగంలో ఓవరాల చాంపియన్‌గా మొదటి స్థానంలో విజయనగరం, రెండో స్థానంలో తూర్పుగోదావరి, మూడో స్థానంలో విశాఖపట్నం జట్లు నిలిచాయి. విజేతలకు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి జగన్‌మోహన్‌రావు, పాఠశాల హెచ్‌ఎం సుమిత్ర చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన జట్లు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనన్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండబాబు, మాజీ కార్యదర్శి సూరిబాబు, వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్య్సరాస భూపతిరాజు, ప్రతినిధులు రామ్ నాయుడు, రాజు పడాల్, సత్యవతి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
‘థాంగ్ టా’ అండర్–14లో ఓవరాల్ చాంపియన్‌గా విశాఖపట్నం
జాతీయ స్థాయి పోటీలకు అర్హత
సాధించిన క్రీడాకారులు
విజేతలకు బహుమతి ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment