చలి వణికిస్తోంది
అరకులోయ టౌన్: కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తోంది. మరోపక్క చలిగాలులు వీస్తున్నాయి. గిరి రైతులు వ్యవసాయ పనులకు తెల్లవారక ముందే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కురుస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో వరి నూర్పిడి పనులు చేపడుతున్నారు. చలితీవ్రతకు మంటలను ఆశ్రయిస్తున్నారు. ఇలావుండగా ఈ వాతావరణ పరిస్థితులు సందర్శను వచ్చే పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయి. చలిలో మంచు అందాలను తిలకించేందుకు మాత్రమే వారు వస్తుంటారు.
హుకుంపేట: దట్టంగా కురుస్తున్న పొగమంచుతోపాటు, చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11గంటల సమయం వరకు మంచు తెరలు వీడకపోవడంతో వ్యవసాయం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మండలంలో చలిగాలులు వీయడంతో మంటలను ఆశ్రయించారు,
నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
దట్టంగా పొగమంచు
Comments
Please login to add a commentAdd a comment