విద్యుత్ చార్జీల బాదుడుపై పోరుబాట
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 27న జిల్లా కేంద్రం పాడేరులో పోరుబాట నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. పోరుబాటకు సంబంధించిన ప్రచార పోస్టర్లను సోమవారం పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని,అవసరమైతే తగ్గిస్తామని బూటకపు మాటలు చెప్పి ప్రజలకు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో కూటమి ప్రభుత్వం భారం మోపడాన్ని నిరసిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరులో పార్టీ నాయకులు,ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి, విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్టు చెప్పారు.జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులు పాల్గొని ఈపోరుబాటను విజయవంతం చేయాలని ఆయన కోరారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, ఎస్టీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్‌కుమార్, ఎంపీటీసీలు లకే రామకృష్ణపాత్రుడు, దూసురు గంగరాజు,తూవురు గంగరాజు,సర్పంచ్‌లు వనుగు బసవన్నదొర,వంతాల రాంబాబు,సోమెలి లక్ష్మణరావు,సీనియర్ నాయకులు మినుముల కన్నాపాత్రుడు,శరబ సూర్యనారాయణ, డి.పి.రాంబాబు,బోనంగి రమణ తదితరులు పాల్గొన్నారు.
27న విద్యుత్ కేంద్రం వద్ద ఆందోళన
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
Comments
Please login to add a commentAdd a comment