మళ్లీ విజృంభిస్తున్న చలి గాలులు
సాక్షి,పాడేరు/చింతపల్లి: జిల్లాలో చలిగాలులు మళ్లీ విజృంభిస్తున్నాయి.రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.మరోవైపు పొగమంచు దట్టంగా కురుస్తోంది.ఉదయం 9గంటల వరకు మంచుతెరలు వీడకపోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకునే వాహనాలను నడుపుతున్నారు. పాడేరు,అనంతగిరి,లంబసింగి,సప్పర్ల,రొంపుల,మారేడుమిల్లి ఘాట్ రోడ్లలో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది.గిరిజనులు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.ఏజెన్సీ ని సందర్శించే పర్యాటకులు కూడా ఫైర్ క్యాంపులతో ఉపశమనం పొందుతున్నారు. జి.మాడుగులలో 9.7 డిగ్రీలు,జీకే వీధి 10.8,పెదబయలు 11.1,డుంబ్రిగుడ 11.6, ముంచంగిపుట్టు 12.1, హుకుంపేట 12.4, పాడేరు 13.8, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 14, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14.3, అనంతగిరిలో 14.3, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు సోమవారం నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవ సాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment