డైట్ కళాశాల పీడీ సస్పెన్షన్
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌పై దురుసుగా ప్రవర్తించిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్(పీడీ) కె.పోతురాజును సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.విజయశాంతి తెలిపారు. ఈ నెల 19న కళాశాల ప్రాంగణంలో అసెంబ్లీ జరుగుతుండగా విద్యార్థినులు,కళాశాల సిబ్బంది ముందు ప్రిన్సిపాల్‌పై దురుసుగా ప్రవర్తించి, దాడి చేసినందుకు సస్పెండ్ చేసినట్టు తెలిపారు. డీడీ తన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ జరిగిన సంఘటనపై కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేయవలసిందిగా సబ్ కలెక్టర్ కల్పశ్రీకి పీవో ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం.. పీవో ఆదేశాల మేరకు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న పీడీ పోతురాజును సస్పెండ్ చేసినట్టు చెప్పారు. పూర్తి స్థాయి విచారణకు కూనవరం ఏటీడబ్ల్యూవో సుజాతను నియమించినట్టు తెలిపారు. కళాశాల విద్యార్థిని పట్ల కూడా పీడీ దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment