ఘనంగా హై టీ క్రిస్మస్
సాక్షి,పాడేరు: ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. స్థానిక కాఫీ అతిథి గృహంలో సోమ వారం రాత్రి హై టీ క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్‌ను కలెక్టర్ కట్ చేసి చిన్నారులు, దైవసేవకులకు తినిపించారు. జిల్లాలోని ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాస్టర్లకు గౌరవ వేతనం కింద నెలకు రూ.5వేలను ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. క్రిస్టియన్ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాస్టర్లలో గ్రూప్‌లు ఉండకూడదని,అందరూ సమానంగా ఉండాలని, శాంతి, సహనం,ప్రేమతో మెలగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ,సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, ఏపీఎంఐపీ పీడీ రహీం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment