నిలకడగా జోలాపుట్టు నీటిమట్టం
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే ప్రధాన జోలాపుట్టు జలాశయంలో నీటి మట్టం నిలకడగా ఉంది.గతంతో పోలీస్తే ఈ ఏడాది జనవరి నెలలో నీటిమట్టం ఎక్కుగా ఉంది. గత ఏడాది వర్షకాలంలో భారీ వర్షాలకు వరద నీరు అధికంగా వచ్చి జోలాపుట్టు జలాశయంలో చేరడంతో నీటి స్థాయి పెరిగింది. ఈ ఏడాది వేసవిలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీటి సమస్య తలెత్తకుండా ప్రాజెక్ట్ అధికారులు ప్రణాళికపరంగా చర్యలు చేపట్టారు. జోలాపుట్టు జలాశయ నీటి మట్టం 2750 అడుగులు కాగా ఆదివారం నాటికి 2744.15అడుగులుగా నమోదయింది. గత ఏడాది ఇదే రోజుకు 2721.65 అడుగుల నీటి నిల్వ ఉండేది. గత ఏడాదితో పోలిస్తే 23 అడుగుల మేర నీరు ఎక్కువగా ఉంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువ ఉన్న డుడుమ జలాశయానికి ఒక గేట్లు ఎత్తి 13 వందల క్యూసెక్కుల నీటిని గత రెండు రోజులుగా విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా ప్రస్తుతం 2581.30 అడుగుల మేర నీరు ఉంది.మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉందని జలాశయ అధికారవర్గాలు తెలిపాయి.
జలాశయంలో పుష్కలంగా నిల్వలు
గతేడాదికన్నా 23 అడుగుల నీరు ఎక్కువ
మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్‌కు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు
Comments
Please login to add a commentAdd a comment