నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణింపు
పెదబయలు: క్రమశిక్షణ,నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణిస్తారని అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి అన్నారు. మండలంలోని సీకరిలో ఆదివారం ఆమె పర్యటించారు. గంగమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చే నెల 9,10,11వ తేదీల్లో గంగమ్మతల్లి పండగ పురస్కరించుకొని ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీమాట్లాడుతూ క్రీడాకారులలో ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. గిరిజన యువతలో అపారమైన ప్రతిభ ఉందని, అందుకు తగ్గట్టుగా సాధన జరిగితే రాణింపు తథ్యమన్నారు.
గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి
సీకరిలో రచ్చబండ వద్ద ఆదివారం అరకు ఎంపీ తనూజరాణి గ్రామస్తులతో సమావేశమయ్యారు. పంచాయతీలోమస్యలను తెలుసుకున్నారు. గంగమ్మతల్లి దేవాలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. సీకరిలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేశానని, పన్నెడ గ్రామ సమీపంలో గంగమ్మతల్లి ఆమ్మవారి సింహాద్వారం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఆమె అన్నారు. గతం అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హయాంలో పంచాయతీని 80 శాతం మేర అభివృద్ధి చేశారన్నారు. ఫిబ్రవరిలో జరిగే గంగమ్మతల్లి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని ఆమె అన్నారు. అనంతరం సీకరి గ్రామ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ,గ్రామస్తులు ఆమెతోపాటు భర్త వినయ్‌లకు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కృష్ణారావు, సురేష్, వైస్‌ఎంపీపీ రాజుబాబు, మాజీ సర్పంచ్ సన్యాసి, ఎంపీటీసీ ఆనందరావు పాల్గొన్నారు.
అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి
సీకరిలో క్రికెట్ పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment