సాక్షి,పాడేరు: సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడిపందాలు, పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు సీఐ డి.దీనబంధు హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోడిపందాలను ఎక్కడ నిర్వహించినా ఉపేక్షించేది లేదన్నారు. పాడేరు సర్కిల్ పరిధిలో పోలీసు బృందాల తనిఖీలు ముమ్మరం చేశాయని, మద్యం సేవించి వాహనాలను నడిపినా చర్యలు తప్పవన్నారు. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారు విలువైన బంగారం వస్తువులను తమ వెంట తీసుకువెళ్లాలని సూచించారు.
పాడేరు: సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామల్లో ఎవరైనా కోడి పందాలు నిర్వహించినా, పాల్గొన్నా చటరీత్య నేరమని పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ నర్సింహులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించి కోడి పందాల శిబిరాలు నిర్వహిస్తే సెక్షన్ 10, గేమింగ్ యాక్ట్ 1974, సెక్షన్34 జంతుహింస నివారణ చట్టం 1960 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామల్లో నిర్వహించే వేడుకల్లో కోడిపందాలు నిర్వహించకుండా వెటర్నరీ అసిస్టెంట్లు దృష్టి సారించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment