గిరిజన గ్రామాల్లో సంక్రాంతి పండగ సందడి కానరావడం లేదు. గ
రూ.లక్ష కూడా అమ్ముడు కాలేదు
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మొగలపూడి రాధ. మండల కేంద్రం పెదబయలులో కొన్నేళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. గతేడాది సంక్రాంతికి రూ.5 లక్షల మేర వస్త్రాలు దుకాణంలో అందుబాటులో ఉంచారు. పండగ నాటికి పూర్తిగా అమ్ముడయ్యాయి. అలాగా ఉంటుందని ఆశించి ఈ ఏడాది రూ.6లక్షల స్టాక్ తీసుకువచ్చారు. పండగ జరిగిన రెండు మూడు రోజుల్లో హోల్‌సేల్ వ్యాపారులకు స్టాక్ మొత్తానికి సంబంధించి డబ్బులు చెల్లించాలి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష కూడా అమ్ముడు కాలేదు. వారికి ఎలా ఇవ్వాలో తెలియడం లేదని వ్యాపారి రాధ వాపోతున్నాడు. గిరిజనుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో ఇలాంటి ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.
రైతుకు భరోసా లేదు
గత ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా పథకంతో ఆర్ధిక సాయం అందేది. కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇవ్వకపోగా, పంటలకు గిట్టుబాటు ధరలను అమలుజేయలేదు.అధిక వర్షాలతో రాజ్‌మా,ఇతర వాణిజ్య పంటల దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. చేతిలో డబ్బులు లేక సంక్రాంతి పండగకు ఇబ్బందులు పడాల్సిందే.
– చెండా కృష్ణారావు,
గిరిజన రైతు, పెదబయలు
కొత్త దుస్తులు కొనలేదు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంక్రాంతి కొత్త దుస్తులు కొనలేదు. రాజ్‌మా పంటకు నష్టం అధికంగా ఉండడంతో చేతిలో చిల్లిగవ్వ లేదు.గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు ఉండేవి. చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు ఎలాంటి సాయం లేదు. పిల్లలకు కూడా కొనలేకపోవడం ఎంతో బాధిస్తోంది.
– పాంగి కొండబాబు,
గిరిజనుడు, పెదబయలు
పండగ కళ లేదు
సంక్రాంతి పండగ సమయంలో తమ గ్రామం ఎంతో సందడిగా ఉండేది. ప్రతి ఇంటి వద్ద ముందుగానే సంక్రాంతి పండగ కనబడేది. ఈఏడాది మాత్రం డబ్బులు లేక తామంతా ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికి సున్నాలు కూడా వేయించలేదు. పూజ సామాన్లు మాత్రమే కొన్నా. కొడుకు, కోడలు, పిల్లలకు దుస్తులు కొనలేకపోయా.
– పాంగి కొండమ్మ,
గిరిజన మహిళ, పెదబయలు
సాక్షి,పాడేరు: గిరిజన గ్రామాల్లో సంక్రాంతి పండగ సందడి కరువైంది. అన్ని వర్గాల గిరిజనులకు ఈఏడాది కూటమి ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. జిల్లాలో జనాభా 10.58 లక్షలు కాగా ఇందులో సుమారు ఏడు లక్షలకు పైగా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. ప్రధానంగా గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో దీని ప్రభావం అన్నిరంగాలపై చూపింది. ఖరీఫ్‌లో వాణిజ్య పంటల దిగుబడి తగ్గడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. అమ్మఒడితోపాటు ఇతర డీబీటీ పథకాలు అమలు చేయకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఆ ప్రభావం కూడా సంక్రాంతి పండగపై చూపింది.
బోసిపోయిన పెదబయలు
ఏజెన్సీలోని ప్రధానమైన పెదబయలు మండల కేంద్రంలో సంక్రాంతి పండగ ఏమాత్రం కనిపించలేదు. కొనుగోళ్లు లేక వస్త్ర దుకాణాలు వెలవెలబోతున్నాయి. దుకాణదారులు రూ.6లక్షల వరకు దుస్తుల స్టాక్‌ను అందుబాటులో ఉంచారు. గత వారం రోజుల్లో కనీసం రూ.లక్ష కూడా అమ్మలేదని వస్త్ర వ్యాపారులు వాపోతున్నారు. భోగి ముందురోజు ఆదివారం కూడా దుకాణాలు కళ తప్పాయి. ఇతర వ్యాపారాల పరిస్థితి అదేవిధంగా ఉంది.
కానరాని శోభ
మండల కేంద్రం పెదబయలులో సంక్రాంతి శోభ కరువైంది. వ్యవసాయ పంటల దిగుబడులు లేక ఆదాయం కోల్పోయిన గిరిజన రైతుల ఇంట సంక్రాంతి పండగ సందడి కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment