తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ
మల్కాపురం : మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment