భలే ప్రేమ ‘చిహ్నం’
కళ్లల్లో ఉదయించి.. కనుమూసినా.. తోడుంటుంది ప్రేమ. శిశిరమైనా.. శిథిలమైనా.. ప్రేమమయమే సుమా అని అన్నాడో కవి. ప్రేమిస్తే.. ప్రపంచమంతా మనసిచ్చిన మనిషిలోనే కనిపిస్తుంది. విరిసే ప్రతి పువ్వులోనూ.. కురిసే ప్రతి చినుకులోనూ ప్రేమ కనిపిస్తుందంటారు. ఇదిగో.. ఇప్పుడీ బంగాళా దుంపలోనూ ప్రేమకు చిహ్నం పలకరిస్తోంది. లలితానగర్‌లో కూరగాయలు అమ్మే కొరిబిల్లి మహేష్ తీసుకొచ్చిన బంగాళాదుంపల్లో.. ఈ దుంప మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. గుండె గుప్పెడంత కాదు.. ఈ బంగాళా దుంపంత అని చెప్పుకుంటున్నారు. ఇంకొందరు ఈ దుంపని చూసి.. ఏంటో ఈ దుంపలో ప్రేమ అని మాట్లాడుకున్నారు. –ఫొటో : సాక్షి,విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment