వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
కూనవరం: సంక్రాంతి ఆచారాల పేరుతో అడవుల్లో వన్యప్రాణులను వేటాడితే కఠినచర్యలు తప్పవని స్థానిక రేంజ్ ఆఫీసర్ ఎం.కరుణాకర్ హెచ్చరించారు. మండల పరిధిలోని జగ్గవరం జంక్షన్, పైదుగూడెం, భైరవపట్నం గ్రామాలను ఆయన సందర్శించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులను వేటాడటం నేరమన్నారు. అడవిలో వేట వద్దు– అడవి జంతువులే ముద్దు, అడవులే ఆనందం–జంతువులే జీవం వంటి ప్లకార్డులతో అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో వి.శంకర్ రెడ్డి, ఎఫ్‌డీవోలు ఎస్.నాగలక్ష్మి, డి.సుబ్బయ్య, సూరయ్య, జంపన్నరాజు, ముర్మూరు బేస్ క్యాంపు సిబ్బంది భద్రం, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment