వెంకన్న ఆలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ
మునగపాక: మునగపాకలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం మునగపాకకు చెందిన కొమ్మూరి శ్రీనివాసరావు–ప్రవల్లిక దంపతులు రూ.1,11,116, పాటిపల్లికి చెందిన ఆడారి సత్యనారాయణ రూ.2 లక్షలు, దాడి వెంకటరమణ, దాడి పరదేశినాయుడుల జ్ఞాపకార్థం వారి కుమారులు అశోక్ కుమార్, అరుణ్‌కుమార్ రూ.55,555, తిమ్మరాజుపేటకు చెందిన భీశెట్టి లక్ష్మణరావు రూ.50 వేలు, తిమ్మరాజుపేటకు చెందిన భీమిశెట్టి అప్పలనాయుడు కుమారులు గణేష్, డాక్టర్ భాస్కరరావు రూ.50 వేలు, వెంకటాపురానికి చెందిన రేఖా తాతారావు రూ.20 వేలు, మునగపాకకు చెందిన మళ్ల జగ్గప్పారావు రూ.50 వేలు వంతున విరాళంగా అందజేశారు. కమిటీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, పెద్దలు సూరిశెట్టి రాము, కాండ్రేగుల జగ్గారావు, పెంటకోట ఉమేష్, ఆడారి అచ్చియ్యనాయుడు, కోనపల్లి రామ్మోహనరావు, పొలిమేర కృష్ణ, ఆడారి కృష్ణ, వెలగా సురేష్‌కుమార్, బొడ్డేడ రామునాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment