ఖాతాదారులకు తప్పని అవస్థలు
అరకులోయటౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రం, ఆంధ్రా ఊటిగా పేరొందిన అరకులోయలో ఏటీఎంల సమస్య వెంటాడుతోంది. నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు చెందిన 10కి పైగా ఏటీఎంలున్నాయి. వీటిలో సగానికా పైగా పనిచేయడంలేదు. మరికొన్ని ఏటీఎంలు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి, ఏటీఎంల ఏర్పాటులో హడావుడి చేసే బ్యాంక్ అధికారులు వాటి నిర్వహణకు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు అవస్థలు పడుతున్నారు. ససకాలంలో నగదు తీసుకోవాలంటే పలు ఏటీఎంలకు తిరగాల్సిన పరిస్ధితి ఏర్పడుతుందని ఖాతాదారులు వాపోతున్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యలయం ఎదురుగా ఉన్న రెండు ఏటీఎంలలో ఒకటి నిత్యం మూతబడి ఉంటుందని, మరోక ఏటీఎంలో క్యాష్ లేనట్లు చూపిస్తుంటుందని ఖాతాదారులు చెబుతున్నారు. డబ్బులు అవసరమైన స్థానికులతో పాటు పర్యాటకులు ప్రైవేట్ ఆన్‌లైన్ సెంటర్‌ల వద్ద నగదు తీసుకుంటే రెండు శాతం చార్జీ చేస్తున్నారని, దీంతో నష్టపోతున్నామని పలువురు ఖాతాదారులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎం సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
మూతబడిన ఏటీఎంలతో ఇక్కట్లు
పట్టించుకోని బ్యాంకర్లు
Comments
Please login to add a commentAdd a comment