మన్యం కప్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం
చింతూరు: ఆల్ ఇండియా ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంటులో భాగంగా మన్యంకప్ సీజన్–2 ఫుట్‌బాల్ పోటీలు ఆదివారం చింతూరులో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్లో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన పలు జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంటు విజేతకు జమాల్‌ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.50 వేలు, రెండో బహుమతి రూ.30 వేలను వీఆర్‌పురం జెడ్పీటీసీ వాళ్ల రంగారెడ్డి, మూడో బహుమతి రూ.15 వేలను ఏఎస్‌డీఎస్ సంస్థ అధ్యక్షుడు గాంధీబాబు అందచేయనున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి ఇమ్రాన్‌ఖాన్, నాయకులు పాయం వెంకయ్య, రమణారెడ్డి, శ్రీనివాసరావు, వెంకట్, ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పూనెం కిరణ్‌కుమార్, సాయి వెంకటరమణ, రాజ్‌కుమార్, అర్జున్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment