డాబాగార్డెన్స్ : సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఆర్‌టీసీ ద్వారకాబస్టేషన్ నుంచి 400 ప్రత్యేక సర్వీసులు నడిపినట్టు ప్రాంతీయ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. నాలుగు రోజులుగా హైదరాబాద్‌కు 25, విజయవాడకు 40 బస్సులు నడపగా, ఆదివారం శ్రీకాకుళం 100, రాజమండ్రికి 20, కాకినాడకు 20, పార్వతీపురానికి 40, పలాసకు 30, సాలూరుకు 30తో పాటు రద్దీ ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపినట్టు చెప్పారు. ద్వారకాబస్టేషన్లో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు రీజియన్ పరిధిలో గల అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక సర్వీసులకు కూడా సాధారణ చార్జీలే వసూలు చేస్తున్నట్టు తెలిపారు. భోగి రోజు కూడా ప్రత్యేక సర్వీసులు రద్దీకి అనుగుణంగా నడపనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment