వణికిస్తున్న చలిగాలులు
● పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● జి.మాడుగులలో 6.2 డిగ్రీల నమోదు
చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలిగాలులు వణికిస్తున్నాయి. ఆదివారం జి.మాడుగులలో 6.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి అరకువేలిలో 7.7 ,డుంబ్రిగుడలో 7.8, చింతపల్లిలో 8.2, జీకేవీధిలో 8.5, హుకుంపేటలో 8.6, పాడేరులో 9.0, పెదబయలులో 9.3 డిగ్రీలు, కొయ్యూరులో 12.4, అనంతగిరిలో 13.3 డిగ్రీలు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. ఉదయం 10 గంటలు వరకూ మంచు అధికంగా కురవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment