ఏకలవ్య భూ దాతలకు న్యాయం చేయండి
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
డుంబ్రిగుడ: మండలంలోని ఏకలవ్య పాఠశాల నిర్మాణం కోసం భూములిచ్చిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కోరారు. ఆదివారం ఆయన కలెక్టర్‌ను కలిసి, ఏకలవ్య పాఠశాల భూ దాతల సమస్య, వారు చేస్తున్న ఆందోళన గురించి వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల మద్దతు
ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న భూదాతలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు.ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం అన్యాయమని దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురాం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment