నరకాసుర దహనం... మిన్నంటిన సంబరం
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం, టీటీడీ అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు భారీగా తరలివచ్చి ఈ ఘట్టాన్ని తిలకించారు. ముందుగా ఉదయం స్వామివారి మూలవిరాట్ సన్నిధిలో నిత్యాభిషేకాలు, అర్చనలు పూర్తిచేశారు. ఉత్సవమూర్తులు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామివారి సన్నిధిలో నిత్యపూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. నరక చతుర్దశి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాజాధిరాజ వాహనంలో వేంచేయింపు జేసి ఉపమాక వీధుల్లో ఊరేగించారు.నరకాసురుని గడ్డిబొమ్మతయారు చేసి ఉపమాక వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ రాజగోపురం ఎదురుగా ఆ గడ్డిబొమ్మను దహనం చేసినట్టు ప్రధానార్చకులు వరప్రసాద్ తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా నరకచతుర్దశి, నరకాసురుని వధ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమాల్లో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment