దీపావళి వేడుకలకు జిల్లా ముస్తాబైంది. పూలు, పూజాసామగ్రి
సాక్షి, అనకాపల్లి : జిల్లా వ్యాప్తంగా ఊరూవాడా వెలుగులు దీపావళి సందడి మొదలైంది. హోల్‌సేల్ దుకాణాలు రెండు రోజులుగా కిటకిటలాడుతున్నా యి. పర్యావరణ హిత పద్ధతుల్లో హరిత టపాసులతో ఆనందంగా దీపావళి జరుపుకోవాలని పర్యావరణ శాస్త్రవేత్తలు, వైద్యులు సూచించారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన అనకాపల్లి టౌన్, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, సబ్బవరాలలో బుధవారం నుంచి స్టాళ్ల ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించారు. స్టాళ్ల వద్ద ఫైర్ అవుట్‌పోస్టులను, ఫైర్ ఇంజన్‌లను ఏర్పాటుచేశారు. గత ఏడాదితో పోల్చితే బాణాసంచా విక్రయాలుతగ్గినప్పటికీ... కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. స్టాళ్ల అనుమతికి కూడా ఈ ఏడాది తక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. బాణసంచా ధరలు 20 శాతం పెరగడంతో 40 శాతం విక్రయా లు తగ్గాయని హోల్‌సేల్ వ్యాపారస్తులు తెలిపారు.
హరిత టపాసులతో పర్యావరణానికి మేలు..
పర్యావరణానికి పెద్దగా హాని చేయని, తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసుల(గ్రీన్ క్రాకర్స్)నే వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీ పీసీబీ) అధికారులు హరిత టపాసుల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరో వైపు రెవెన్యూ, పోలీసు, ఫైర్ విభాగాల అధికారులు ముందస్తు జాగ్రత్తలతో స్టాళ్ల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. ప్రతి దుకాణానికి మధ్య 3 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పొరపాటున అగ్ని ప్రమా దం సంభవించినా.. పక్కదుకాణానికి చేరకుండా.. ముందస్తుగానే మంటల్ని అదుపు చేసేలా ఇసుక, నీళ్లు తదితర ఏర్పాట్లు చేసుకోవాలని స్టాళ్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
షాపుల వివరాలు...
జీవీఎంసీ పరిధిలో ఉన్న అనకాపల్లి టౌన్‌లో ఎన్టీఆర్ క్రీడామైదానంలో 40 స్టాళ్లకు, రింగ్‌రోడ్డు బెల్లం మార్కెట్‌లో 6 స్టాళ్లకు అనుమతి ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఆరు ఫైర్ స్టేషన్ల పరిధిలో మొత్తం 231 స్టాళ్లకు అనుమతి ఇచ్చారు.
దివ్యకాంతుల
దీపావళి
అప్రమత్తతతోనే ఆనంద కాంతులు
హరిత టపాసులతో పర్యావరణానికి మేలు
జిల్లా వ్యాప్తంగా 271 స్టాళ్లకు అనుమతి
జీవీఎంసీ పరిధిలో 40, రూరల్ జిల్లా పరిధిలో 231
షాపుల వద్ద ఫైర్ అవుట్‌పోస్టుల ఏర్పాటు
ఫైర్ అవుట్ పోస్టుల ఏర్పాటు
అనుమతి లేకుండా క్రాకర్స్‌ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. బాల్కనీ, టెర్రస్‌లపై బాణసంచా కాల్చొద్దు. ప్రమాదాలు జరిగితే టోల్‌ఫ్రీ నంబర్ 101 కాల్‌చేసి అక్కడ అడ్రస్, లాండ్‌మార్క్ చెబితే త్వరగా రాగలుగుతాం. క్రాకర్స్ విక్రయించే దుకాణాల మధ్య దూరం 3 మీటర్ల ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రాకర్స్‌ను కొనేటప్పుడు క్యూ పద్ధతిలో వెళ్లడం మంచిది. ఈ ఏడాది స్టాళ్లు ఏర్పాటు చేసే చోట ఫైర్ అవుట్‌పోస్టులను ఏర్పాటుచేశాం. అదేవిధంగా స్టాళ్లు ఎక్కువగా ఉండే చోట మినిమమ్ చార్జీలు చెల్లిస్తే.. ఒక ఫైర్ ఇంజిన్‌ను ఏర్పాటు చేస్తున్నాం.
–ఆర్.వెంకట రమణ, జిల్లా ఫైర్ ఆఫీసర్.
కాలిన గాయాలపై పేస్ట్ పూయొద్దు..
క్రాకర్స్ వల్ల కాలిన గాయాలైతే ఐస్ నీరు, సిరా, ఐస్ ముక్కలతో రుద్ద వద్దు. ఆయింట్‌మెంట్, టూత్ పేస్ట్, పసర్లు, పసుపు వంటివి పూయ కూడదు. జనరల్ ట్యాప్ వాటర్‌నే వేయాలి. బట్టలకు మంటలు అంటుకున్నప్పుడు కంగారుపడి పరిగెత్తకూడదు. పడుకుని దొర్లడం వల్ల మంటలు ఆరిపోతాయి. వెంటనే గాయాలపై నీళ్లు పోయాలి. గాయాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పి వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. బాణసంచా వెలిగించేటప్పుడు వీలైనంత వరకు కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది.
– డాక్టర్ సుధాకర్, ఎన్‌ఆర్‌ఐ డీన్, విశ్రాంతి ఎఎంసీ ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment