కేసులు పెట్టినా తగ్గేదేలే
● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం: ఇసుక దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు ప్రొద్బలంతో రూర ల్ సీఐ రేవతమ్మ వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసుపెట్టారని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక దోపిడీ నుంచి బయటపడేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకురాలి లా రూరల్ సీఐ వ్యవహరిస్తున్నారని, స్పీకర్ చెబితే తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. ఇదే విధంగా వ్యవహరిస్తే సీఐపై కోర్టును ఆశ్రయించడంతో పాటు సర్కిల్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈనెల 25వ తేదీ రాత్రి గబ్బాడ ఇసుక స్టాక్ పాయింట్‌లో అనుమతి లేకుండా రెండు లారీల్లో ఇసు క లోడుచేస్తున్నారన్న సమాచారం మేరకు మున్సిపల్ వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, లీగల్‌సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర వెళ్లారని, వీరిని చూసి స్టాక్ పాయింట్ వద్ద ఉన్న టీడీపీ నాయకులు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఈ విషయమై పార్టీ నాయకులతో కలిసి 26న తాను రూర ల్ సీఐ రేవతమ్మకు ఫిర్యాదు చేశానన్నారు. ఇసుక దోపిడీ నుంచి బయటపడేందుకు స్పీకర్ ఆదేశాల తో... వైఎస్సార్‌సీపీ నాయకులు చంపేస్తామని బెదిరించడంతోపరుగులు తీశానని 27వతేదీ మధ్యాహ్నం వీఆర్వోపోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. యార్డులో ఉన్నవి వీఆర్వో ట్రాక్టర్లు అంటున్నారని, అయితే 6 గంటలకే యార్డుకు వచ్చి రెండు లారీలను బయటకు పంపించేశామని మరో వైపు తహసీల్దార్ చెప్తున్నారని తెలిపారు.అధికారుల మాటల మధ్య పొంతనలేద న్నారు. ఈవిషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేమన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వీఆర్వో, తప్పుడు కేసులు పెట్టించిన అధికారులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, టౌన్ అధ్యక్షులు ఏకా శివ, పార్టీ లీగల్‌సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, కౌన్సిలర్లు బయపురెడ్డి చినబాబు, సిరసపల్లి నాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment