స్టీల్‌ప్లాంట్‌కు నిధులేవి..?
స్టీల్‌ప్లాంట్ మూల ధనం కోసం రూ.2 వేలు కోట్లు సాయం చేయాలని ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయిదు నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమయ్యే ఉక్కును ఈ నిధుల ద్వారా కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. కానీ కూటమి ప్రభుత్వ బడ్జెట్లో స్టీల్‌ప్లాంట్‌ను కూడా పట్టించుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిధులను సమకూర్చేందుకు ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రతిపాదనలను సైతం కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. తాజాగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్న అఖిలపక్ష నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. కనీసం పైసా కూడా కేటాయించకపోవడం కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంటో అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment