విశాఖ ప్రస్తావనే లేదు..
విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. కానీ అధికారం చేపట్టాక రాష్ట్ర ఖజానాను నింపుకోవడానికే విశాఖను ఉపయోగించుకున్నారన్న విషయం తేటతెల్లమవుతోంది. విశాఖకు మెట్రో రైలు, ప్రత్యేక రైల్వే జోన్, పర్యాటకాభివృద్ధికి విభిన్నమైన ప్రాజెక్టులు అని గప్పాలు కొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లో ఉమ్మడి విశాఖ ప్రస్తావనే చేయకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రత్యేక రైల్వే జోన్ పనులను పరుగులు పెట్టిస్తామని ఇటీవలే చంద్రబాబు విశాఖ పర్యటనలో ప్రకటనలు చేశారు. అయితే జోన్ ఏర్పాటుకు అవసరమయ్యే మ్యాచింగ్ గ్రాంట్ నిధులకు మాత్రం బడ్జెట్‌లో కేటాయించలేదు. త్వరలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని చెప్పినప్పటికీ.. బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టు ఊసు కూడా లేదు. ఇక పర్యాటకం విషయాన్ని కనీసం పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment