తండ్రి కళ్లముందే మృత్యు ఒడికి.. | - | Sakshi
Sakshi News home page

తండ్రి కళ్లముందే మృత్యు ఒడికి..

Published Mon, Nov 18 2024 3:02 AM | Last Updated on Mon, Nov 18 2024 3:01 AM

తండ్ర

తండ్రి కళ్లముందే మృత్యు ఒడికి..

అగనంపూడి: ఇక్కడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కన్నీరు పెట్టించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లముందే ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న దేముళ్లు, భార్య దేవి, కుమార్తె వెంకటి, కుమారుడు పవన్‌కుమార్‌ స్థానిక బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాలనీకి సమీపంలోనే సాధన పబ్లిక్‌ స్కూల్‌లో పవన్‌, ప్రభుత్వ పాఠశాలలో కుమార్తె ఏడవ తరగతి చదువుతోంది. ఎప్పట్లాగే కుమారుడు పవన్‌ను దేముళ్లు పాఠశాల వరకు తీసుకెళ్లారు. లోపలకు వెళ్లిపొమ్మని చెప్పి అక్కడి నుంచి పరవాడ ఫార్మా కంపెనీకి వెళ్లేందుకు బస్సు కోసం ఆయన జాతీయ రహదారి దాటుతుండగా కుమారుడు వెంట పడ్డాడు. అదే సమయంలో లంకెలపాలెం నుంచి గాజువాక వైపు వస్తున్న ఫార్మా కంపెనీ బస్సు పవన్‌ను ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న కుమారుడు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి దేముళ్ల తట్టుకోలేక పోయాడు. గుండెలివిసేలా రోదించాడు. కుమారుడు మరణవార్త తెలుసుకున్న తల్లి దేవి గుండెలు బాదుకుంటూ సంఘటన స్థలం వద్ద విలపించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. బంధువులు బోరున విలపించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దువ్వాడ సీఐ కిల్లి వెంకటరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబం సొంతూరు చోడవరం మండలం లక్కవరం పంచాయతీలోని మామిడిపల్లి గ్రామమని బంధువులు తెలిపారు.

తండ్రి వెంట పరుగులుతీసి బస్సు ఢీకొనడంతో దుర్మరణం

అగనంపూడి జాతీయ రహదారిపై ఘోర సంఘటన

శోకసంద్రంలో తల్లిదండ్రులు, బంధువులు

No comments yet. Be the first to comment!
Add a comment
తండ్రి కళ్లముందే మృత్యు ఒడికి.. 1
1/2

తండ్రి కళ్లముందే మృత్యు ఒడికి..

తండ్రి కళ్లముందే మృత్యు ఒడికి.. 2
2/2

తండ్రి కళ్లముందే మృత్యు ఒడికి..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement