నేటి నుంచి బాలోత్సవం
డాబాగార్డెన్స్: మహారాణిపేటలో గల సెయింట్ ఆంతోనీ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 19 నుంచి 21 వరకు బాలోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు బాలోత్సవం ప్రధాన కార్యదర్శి జి.ఎస్.రాజేశ్వరరావు తెలిపారు. సోమవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతేడాది 6 వేల మంది పిల్లలు 84 ఈవెంట్లలో పాల్గొనగా, ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు పాల్గొంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్, డీఈవో సారథ్యంలో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యక్షురాలు కె రమాప్రభ మాట్లాడుతూ 700 స్కూళ్లకు పోటీల బ్రోచర్ పంపామని, విశేష స్పందన కనిపిస్తోందన్నారు. కోశాధికారి దండు నాగేశ్వరరావు మాట్లాడుతూ పోటీలు జరిగే 76 ఈవెంట్లకు జడ్జీలుగా వ్యవహరించేందుకు కళా, సాంస్కృతిక రంగాల్లో నిష్ణాతులైన 96 మంది అంగీకరించారని తెలిపారు. పాల్గొనే పిల్లలందరికీ సర్టిఫికెట్లు, విజేతలకు మెమోంటోలు అందజేయనున్నామని తెలిపారు. సమావేశంలో అధ్యక్షుడు పి.రఘు, కమిటీ సభ్యులు ఎల్లాజీ, సీహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment